రజకులకు రక్షణ చట్టం చేయాలి.
ప్రతి రజక వృత్తిదారుల కి 10 లక్షల రుణం మంజూరు చేయాలి.

===> తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం(TRVS )డిమాండ్
==={=========}==========
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం, యాదాద్రి, భువనగిరి జిల్లా, యాదగిరిగుట్టలో జరిగింది.

ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గుమ్మడి రాజు నరేష్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫైళ్ల ఆశయ్య, తీర్మానం ప్రవేశపెడుతు, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా రజక వృత్తిదారులు ఉన్నారని,సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, తీవ్ర వెనుకబాటు తనం ఎదుర్కొంటున్నారని, అత్యంత వెనుకబడ్డారాని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తగిన నిధులు కేటాయించకపోవడంతో, గత * బడ్జెట్లో, 2021 సం:లో కేటాయింపులు లేనందున రుణాలు రాలేదన్నారు. రాష్ట్రంలో రజకుల పైన కుల వివక్షత, సామాజిక దాడులకు గురవుతున్నారని, అనేకచోట్ల రజక మహిళలపై, అత్యాచారాలు, లైంగిక వేధింపులకు, పెత్తందార్లచే గురవుతున్నారని ఆయన అన్నారు. వీటిని అరికట్టడానికి, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, తరహాలో ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల రజక వృత్తి దారులు చెరువులు, నదుల వద్ద, బట్టలు ఉతుకుతుా, ప్రమాదాలకు గురవుతూ మరణిస్తున్నారని, వారికి, రూ, 5 లక్షల భీమా ఏర్పాటు చేయాలని,అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో, ఆధునిక దోబీ ఘాట్ లు నిర్మించాలని, ఉచిత విద్యుత్ Lt 4 లోకి మార్చాలని, ప్రభుత్వ దవాఖానాలు, తదితర ప్రభుత్వ సంస్థల్లో వృత్తి కాంట్రాక్టులు, రజకులకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రజక ఫెడరేషన్ కు, పాలక వర్గాని నియమించాలన్నారు.

చాకిరేవు భూముల పరిరక్షణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. రజకుల సమస్యల సాధనకై భవిష్యత్తులో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, పలు కార్యక్రమాల ద్వారా, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సాధించుకోవడానికి, ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానిస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో, రాష్ట్ర ఉపాద్యక్షలు, వడ్డెమాను శ్రీనివాస్, సీఎచ్.ముసలయ్య, యం.బాలకృష్ణ, రాష్ట్ర సహయ కార్యాదార్శులు, అన్నారపు వెంకటేశ్వర్లు, సీ.మల్లేష్,యాదాద్రి భువనగిరి జిల్లా అద్యక్షులు మలీగే ధశరధ, రాష్ట్ర కమిటీ సభ్యులు కోట్ర నవీన్,పెద్దాపురం శాలీశ్వర్ ,మాదారు, చెరుకు పెద్దులు, ,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుండి రాష్ట్ర కమిటీ సభ్యులు,తదితరులు,పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.