రజకుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం-పైళ్ళ.ఆశయ్య

హన్మకొండ జిల్లా సదస్సు మేడికల్ యూనియన్ ఆఫీస్ లో కంచర్ల కుమార స్వామి అద్యక్షతన జరిగింది. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 10లక్షల జనాభా కలిగిన రజకులు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో తీవ్రంగా వెనకబడి ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాల కాలంలో రజకుల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి గారి రజకుల అభివృద్ధి కోసం ప్రకటించినటువంటి హామీలు ఒకటి కూడా అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వృత్తి కాంట్రాక్టు రజకులకు ఇస్తామని చెప్పిన హామీ మరియు ప్రభుత్వ స్థలాలలో మోడ్రన్ ధోబీఘట్ల నిర్మాణం, జీ.వో 190 ప్రకారం ఋణాలు, పెడరేషన్ నిదుల హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రజకలు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారుచేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కాడబోయిన లింగయ్య మాట్లాడారు.ఈకార్యక్రమంలో వృత్తి సంఘాల జిల్లా నాయకులు గొడుగు వెంకట్. నాయకులు జిల్లా నాయకులు కె.బాబు,రమదేవి,జె.కవిత, జి.ప్రియాంక,యం.క్రిష్ణ, జి.మెగిలి ,రమేష్,పి.నాగేష్, సుదాకర్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.