రజక ఫెడరేషన్ ద్వారా రజక వృత్తిదారులు అందరికీ 10 లక్షల రుణం ఇవ్వాలి

తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య
రజక ఫెడరేషన్ ద్వారా రజక వృత్తిదారుల అందరికీ రూపాయలు 10 లక్షల రుణం ఇవ్వాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య అన్నారు.శనివారం జనగామ పట్టణ కేంద్రంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ప్రీస్టన్ గ్రౌండ్ నుండి కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ తీసి ఉత్సాహ పూర్వకంగా నిర్వహించారు.అనంతరం జెండా ఎగురవేసి వీరనారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మా సభకి అధ్యక్షత వర్గంగా చిట్యాల సమ్మయ్య. మైలవరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆశయ్య పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు.తీవ్రమైన వివక్ష ప్రదర్శిస్తోందని అన్నారు.వృత్తి దెబ్బతిని రజకులు కూలీలుగా మారుతున్నారు.ఎదుర్కోవడానికి రజకులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.
రజకుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది
బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి బి రవీందర్ గారు
రజకుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి బి రవీందర్ అన్నారు. రజకులకు ఏ అవసరం వచ్చినా వారి పని చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు.రజకులు వారి పిల్లలను పై చదువులు చదివించి విఘ్నాలు గా మార్చాలి అన్నారు.
అనంతరం మహాసభ కొన్ని ప్రత్యేకమైన డిమాండ్స్ ప్రతిపాదించారు.
జనగామ జిల్లా కు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలి.
190 జీవో ప్రకారం ఫెడరేషన్ కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇవ్వాలి.
50 సంవత్సరాలు నిండిన రజక వృత్తిదారుల అందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి.
ఈ మహాసభకు పలు ప్రజా సంఘాల నాయకులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు, కేజీ కేస్ రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్,రాపర్తి సోమయ్య పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం
రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఉల్లేంగల నవ్యశ్రీ నర్సింగ్ జ్యోతి ఉపేందర్,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, జిల్లా నాయకులు ఎద్దు నూరి మదర్, కొలిపాక నరసింహ, పైండ్ల యాకయ్య, రెడ్డిరాజుల నారాయణ, పొన్నం శ్రీనివాస్, ఎం వెంకటేష్, వడ్డెమాను శ్రీనివాస్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.