రజాకార్ల ఆగడాలకు ఎదురు నిలిచిన వీరవనితలు మల్లు స్వరాజ్యం.

రజాకార్ల ఆగడాలకు ఎదురు నిలిచిన వీరవనితలు మల్లు స్వరాజ్యం. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలు కొనసాగించాలి.
ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి
రజాకార్ల ఆగడాలకు ఎదురు నిలిచిన వీర వనితలు మల్లు స్వరాజ్యం. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి అన్నారు. శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి. మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కార్ ను గడగడలాడించిన వీర వనితలు మల్లు స్వరాజ్యం. చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తూ గ్యాస్. పెట్రోల్ డీజిల్ ధరలు విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు 30- 40 సంవత్సరాల మహిళలు పని లేక లక్షలాదిమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లో మద్యం ఏరులై పారుతున్న ప్రభుత్వం మరియు అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అని మద్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో మహిళల సమస్యలపై సర్వేలు చేసి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. మహిళలపై రోజుకు ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పాలకుర్తి మండలంలోని manchupula గ్రామానికి చెందిన దళితుల సమస్యలు పరిష్కరించాలని స్థానిక మంత్రి గారైన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్పందించి వారి ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో* ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్రి అహల్య జిల్లా కమిటీ సభ్యులు యం డి శభన. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న. సి ఐ టి యు నాయకులు సోమ అశోక్ బాబు.ఐద్వా నాయకులు తోటకూరి శాంతమ్మ. యాదమ్మ. ఏం శోభ. బి రేణుక. లావణ్య. యాకమ్మ. సోమక్క. వెంకటమ్మ. ప్రశాంత్. సైదులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.