రజాకార్ల ఆగడాలకు ఎదురు నిలిచిన వీరవనిత మల్లు స్వరాజ్యం
సీఐటీయూ.తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం.తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం.
నైజాం రజాకర్ల పాలనకు ఎదురు నిలిచి పోరాడిన వీరవనిత. దొరల కబంధహస్తాల్లో నుండి పేద ప్రజలను విముక్తి చేయడం కోసం బందూకు పట్టిన ధీరవనిత మల్లు స్వరాజ్యం అని సిఐటియు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు చిట్యాల సోమన్న కమ్మ గాని రమేష్.* కమ్మ గాని నాగన్న ఎదు నూరి మాదార్ అన్నారు. మంగళవారం రోజున పాలకుర్తి మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తాలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అనారోగ్యానికి గురై మరణించరని. వారి మృతికి సంతాపం తెలియజేశారు. 1945 -48 సంవత్సరాలలో తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి. నైజాం సర్కార్ ను గడగడలాడించిన వీరవనిత అని కొనియాడారు. రజాకార్ల ఆగడాలు ఎదుర్కొంటూ సింహనాద మై గెరిల్లా దళాలతో వీరోచితంగా పోరాటం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించరని అన్నారు. దొరల కబంధహస్తాల్లో నుంచి పేదలను విముక్తి చేయడానికి బంధువు కి పట్టిన స్వరాజ్యం పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు అని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మూస్కు ఇంద్రారెడ్డి. వీరమల్ల రాజు. వెంకటేశ్వర్లు సాగర్ మోత్కుపల్లి విజయ్ సోమన్న. కమ్మ గాని మహేందర్బొంకూరు ఉప్పలయ్యతదితరులు పాల్గొన్నారు
