రాకేశ్ సంస్మరణ సభ

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, దబ్బిర్ పేట గ్రామంలో రాకేశ్ సంస్మరణ సభ సోమవారం జరిగింది.ఈ సభలో రాకేశ్ కుటుంబానికి సీఎం కెసిఆర్ ప్రకటించిన 25 లక్షల ఎక్స్ గ్రేషీయా,వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నియామక పత్రాలను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రాకేశ్ కుటుంబ సభ్యులకు అందచేశారు.ఈ సభలో వెంటనే అగ్నీ పత్ ను వెనక్కి తీసుకోవాలని,తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..దేశం కోసం రాకేశ్ అంకితమయ్యాడు రాకేశ్ ఆత్మ బలిదానం వృథా కాదు సైనికులలో చేరాలనే కాంక్షతో దేశ భక్తి కి స్ఫూర్తిగా నిలిచాడు
ఇంత జరిగినా రాకేశ్ కుటుంబాన్ని కేంద్రం ఆదు కోలేదు సీఎం కెసిఆర్ మానవతా దృక్పథంతో ఆదుకున్నారు వాళ్ళ ఇంటిలో ఒకరికి రెవెన్యూ విభాగంలో వారి విద్యార్హత ను బట్టి ఆఫీస్ సబార్డి నేట్ ఉద్యోగం ఇచ్చారు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చారు ఈ రోజు రాకేశ్ కుటుంబానికి అవి అప్పగించాము మారుమూల పోడు చేసుకుని బతికే గ్రామం నుంచి దేశ రక్షణకు వెళ్ళాలని అనుకున్న రాకేశ్ గొప్ప తనం అందరికీ ఆదర్శం రాకేశ్ ఆత్మ శాంతించాలంటే వెంటనే అగ్నీ పత్ ను వెనక్కి తీసుకోవాలి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి
మన సీఎం కెసిఆర్ తరహాలో దేశ వ్యాప్తంగా చనిపోయిన రైతులను ఆదుకోవాలి దబ్బిర్ పేట గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్న ఈ గ్రామ అభివృద్ధి నా బాధ్యత
దబ్బిర్ పేట లో వివిధ అభివృద్ధి పనులకు 50 లక్షలు మంజూరు చేస్తున్న
కేవ్ లా తండా కు 20 లక్షలు మంజూరు
దళిత బంధు,ఇండ్లు వంటి ఏ పథకాలు వచ్చినా దబ్బిర్ పేట కు అధిక ప్రాధాన్యం ఇస్తాను అని వాగ్దానము చేశారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,వర్ధన్నపేట ఎమ్మెల్యే,వరంగల్ జిల్లా టీఆరెఎస్ అధ్యక్షుడు ఆరూరీ రమేశ్,జిల్లా కలెక్టర్ గోపి,ఆర్డీఓ,వివిధ శాఖల అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ సర్పంచ్, రాకేశ్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.