రాజదానిలో భూమాఫియా బరితెగింపు


C.I పై పెట్రోల్ దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

తెలంగాణలో ప్రజా రక్షణ ప్రశ్నార్థకం

( వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ బూడిది గోపి )

మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమ నిర్మాణాలను తొలగింపు సందర్బంగా భూఅక్రమణదారులు రెవిన్యూ, పోలీసు అధికారులపై పెట్రోల్ పోసి నిప్పంటించగా C.I భిక్షపతిరావుకు మంటలు అంటుకొని 50శాతం గాయాలయ్యాయని ఈ ఘటనకు కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలని, C.I కి మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబానికి అండగా ఉండాలని లేదంటే వృత్తి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు.

దివి: 25-12-2020 శుక్రవారం రోజున పట్టణంలోని స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో NPRD జిల్లా కార్యదర్శి బిట్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి వృత్తిసంఘాల జిల్లా కన్వీనర్ బూడిది గోపి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంవత్సరం క్రితం జవహర్ నగర్ ప్రధాన రహదారిలో సర్వేనెంబర్ 432 గజాల స్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ కోసం స్థలం కేటాయించారని అన్నారు. కొంతమంది భూకబ్జాదారులు ఈ భూమిలో నిర్మాణాలు చేపట్టడంతో అట్టి సమాచారాన్ని అందుకొని స్థలంలో నిర్మాణాలను తొలగించేందుకు కమిషనర్ నేతి మంగమ్మ, తహశీల్దార్ K.గౌతమ్ కుమార్ వారి సిబ్బందితో మరియు జవహర్ నగర్ C.I P.బిక్షపతి రావు ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో కలిసి వెళ్లగా భూకబ్జాదారులతో కొంతమంది బీజేపీ నాయకులు, తెరాస నాయకులు అధికారులపై, పోలీసులపై దాడులకు యత్నించారని తెలిపారు. ఈ సందర్బంగా వారితో తెచ్చుకున్న పెట్రోలును C.I బిక్షపతిరావు పై పోసి నిప్పంటించారు. దీంతో మంటలు అంటుకొని C.I కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయని వెంటనే సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించగా వారికి 50శాతం గాయాలైనట్టు వైద్యులు తెలిపారని అన్నారు. భారత రాజ్యాంగం ప్రజా రక్షణకోసం పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. అలాంటి పోలీసులపైనే దాడులు చేస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూమాఫియా రాజ్యమేలుతుందని ప్రభుత్వాలు వీళ్లకు వత్తాసు పలకడంతో వీళ్ళ ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వ, ప్రజాధనం లూటీ పాలకుల కనుసన్నుల్లోనే జరుగుతుందని అన్నారు. వీటిని ప్రశ్నింస్తే, ఎదురిస్తే ఇలాంటి దాడులు చేస్తూ ప్రజలను భయబ్రా0తులకు గురిచేస్తూన్నారని అన్నారు. ప్రజాజీవితాలతో మమేకమై ప్రజలను కంటికి రెప్పలా కాపుడుతున్న పోలీసులపైనే ఇలాంటి దాడులు జరిగితే ప్రజల పరిస్థితి ఏంటని, ప్రజలకు ఆపదలు వస్తే ఎవరితో మొరపెట్టుకోవాలనే సందేహం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ఎవ్వరి వత్తిళ్లు లేకుండా, చట్టం తనపని తాను చేసుకొనేలా పాలన జరిగినప్పుడే సామాన్య ప్రజానీకానికి నమ్మకం, దైర్యం వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ఎంతటి వారైనా దాడికి పాల్పడిన దుండగులకు కఠినంగా శిక్షించాలని, దాడిలో గాయపడిన C.I బిక్షపతిరావుకు మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబానికి అండగా ఉండాలని, భవిష్యత్లో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ వృత్తి సంఘాల నాయకులు బాల్నే వెంకట మల్లయ్య, కళ్యాణం లింగం, దడిగే సందీప్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.