రాజేందర్ రెడ్డి నాయకత్వంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ధర్నా

వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ నిరసన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను, గ్యాస్ ధరలను తగ్గించాలని ఉప్పులు, పప్పులపై, పాలపై విధించిన జీఎస్టీని వేసి పేద ప్రజల నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాలు వెంటనే అధిక ధరలను, తగ్గించి జిఎస్టిని ఎత్తివేయాలని ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నిరాశ్రయులైన వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అకాల వర్షాలు కురుసాయని వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటించి సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా ప్రజలకు ఏటూరునాగారం, మంగపేట, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో వరద బాధితులను కలిసి నామమాత్రపు ప్రకటనలు చేసి ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఏం సాధించి కొచ్చారో చెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో రాష్ట్రంలో పేదల నడ్డి విరుస్తూ అధిక ధరలను పెంచి మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ బిజెపి, టీఆర్ఎస్ ప్రభుత్వాలు నేడు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలకు పూనుకున్నారని దేశంలో గాంధీ కుటుంబం పై ఈడీ పేరుతో మోడీ ప్రభుత్వం కక్ష సాధింపులు చేయడం ప్రజలు గమనించారని అన్నారు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిన్నటి వరకు ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ నేడు కేంద్ర ప్రభుత్వంపై కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి రోడ్లపై నిరసనలు చేయడం విడ్డూరంగా ప్రజలు తిలకించారని నిజానికి రాష్ట్ర విభజన చట్టంలో వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పార్లమెంట్ సాక్షిగా చట్టం చేసి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆరు నెలల్లో పనులు ప్రారంభించాలని ఉంటే బిజెపి, టీఆర్ఎస్ ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తినట్లు ఉండి కోచ్ ఫ్యాక్టరీ అవసరంలేదని రెండు ప్రభుత్వాలు కలిసి లోపాయికారి ఒప్పందంతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మహారాష్ట్రలో నెలకొల్పారని విమర్శించారు.

నిజానికి ఎనిమిది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంతో జతకట్టి ఎన్నో బిల్లులకు అసెంబ్లీ సాక్షిగా తీర్మానాలు చేసి నేడు కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నట్టు నాటకాలు ఆడడం ప్రజలు గమనించారని ఇంతటితో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఆగదని ఏఐసిసి పిలుపుమేరకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉద్యమాలు కొనసాగిస్తుందని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ బడ్జెట్ కేటాయించి ఆదుకోవాలని మరియు పేదల నడ్డి విరుస్తు పెంచిన నిత్యవసర సరుకుల ధరలను వెంటనే దించాలని పెట్రోల్, డీజిల్ ,వంటగ్యాస్ ధరలను తగ్గించాలని ఉప్పులు, పప్పులు, పాలపై జిఎస్టి ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, తోట వెంకన్న, పెరుమాండ్ల రామకృష్ణ, మహమ్మద్ అయూబ్, అనిల్ కుమార్, అజీజ్ ,బంక సంపత్, కూర వెంకట్, మహమ్మద్ అంకుస్ కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్ , తవటం రవీందర్, దేశిని ఐలయ్య, అంబేద్కర్ రాజు, విక్రమ్, పులి రాజు,రాహుల్ రెడ్డి, కార్తీక్ ,సతీష్ ,భారతమ్మ డివిజన్ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.