రాత్రి కర్ఫ్యూను అమలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు

రాత్రి కర్ఫ్యూను అమలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు పరకాల ఏసీపీ శ్రీనివాస్

రాష్ట్రంలో రోజురోజుకు కరోన మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి వెల కర్ఫ్యూ విధింస్తునట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కావున రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ప్రజలు బయటకు తిరగడం నిషేధించబడింది. దుకాణాలు రెస్టారెంట్లు , బార్లు ,సినిమా‌ హాల్స్ ‌,ఇతర వ్యాపార సంస్థలన్నీ రాత్రి ఎన్ని గంటల వరకే మూసివేయవలెను.
ఇట్టి నీషేధాన్ని ఎవరైనా ఉల్లంఘించిన చొ సెక్షన్ 188 ipc మరియు సెక్షన్ 51, 60 డిఎం యాక్ట్ 2005 ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడును. కావున ప్రజలందరూ స్వియ నియంత్రణ పాటించి కరోనా కట్టడికి సహకరించాలని పోలీసుశాఖ తరపున కోరుతున్నాము.
అత్యవసర సేవలు ఆసుపత్రులు , మెడికల్ ,రవాణా , రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాకపోకలు , మీడియా , ఆహారపదార్ధాల వాహనాలు ,వీటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది.

పరకాల డివిజన్ లోని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ఈ విషయంపై ప్రజలకు అవగాహన కోసం చాటింపు ద్వారా తెలియజేయాలని, అలాగే స్థానిక గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ సామాజిక బాధ్యతగా తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పరకాల ఏసిపి పి‌.శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.