రాత్రి పూట కర్ఫ్యూ : ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 30 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ

వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రజలు పోలీసు వారికి సహకరించాలి.పెట్రోల్ బంకులు,మీడియాకు మినహాయింపు

జిల్లా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి కరోనా వైరస్ కట్టడిలో పోలీసు వారికి సహకరించాలి.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రాత్రి పూట కర్ఫ్యూ మంగళవారం నుండి అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కొరకు రాత్రి పూట కర్ఫ్యూ విధించి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోవడం జరిగిందని అన్నారు. అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, పెట్రోల్ బంక్‌లు మరియు మీడియాకు కర్ఫ్యూ నుండి మిన‌హాయింపు ఇచ్చినట్లు తెలిపారు.రాత్రి పూట 9-00 గంట‌ల నుంచి ఉద‌యం 5-00 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లలో ఉంటుందని ఎస్పీ గారు ఈ సందర్భంగా తెలిపారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేసి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని తెలిపారు.

ప్ర‌భుత్వ‌,ప్ర‌యివేటు కార్యాల‌యాలు, సంస్థ‌లు,వ్యాపార,వాణిజ్య సంస్థలు, కంపెనీలు,షాపింగ్‌మాల్స్‌ మరియు రెస్టారెంట్ల‌ను రాత్రి 8-00 లోగా మూసివేయాలని, రాత్రి 9-00 గంట‌ల త‌ర్వాత క‌ర్ఫ్యూ పటిష్టంగా అమ‌లు చేస్తామని తెలియజేసారు.కర్ఫ్యూ సమయంలో మినహాయించబడిన ప్ర‌భుత్వ ఉద్యోగులు,మెడిక‌ల్ సిబ్బంది, మీడియా ప్ర‌తినిధులు విధిగా త‌ప్ప‌నిస‌రిగా ఐడీ కార్డుల‌ను తమతో కలిగి ఉండాలని కోరారు. అదే సమయంలో ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేష‌న్లు, బ‌స్టాండ్ల‌కు వెళ్లే ప్ర‌యాణికులు వ్యాలిడ్ టికెట్ల‌ను తమ వ‌ద్దే ఉంచుకొని కర్ఫ్యూ సమయంలో వాటిని చూపించాల్సి ఉంటుందని, అంత‌ర్ రాష్ట్ర స‌ర్వీసులు,రాష్ట్ర స‌ర్వీసులు య‌థావిధిగా కొన‌సాగుతాయని తెలిపారు.

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు,వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, ఉద్యోగులు అన్ని వర్గాల వారు పోలీసు వారికి సహకరించి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కలిసి రావాలని ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.