రాబోయే రోజుల్లో ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి

భూపాలపల్లి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో కెసిఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. బిజెపి పార్టీ తరఫున మేము కేసీఆర్ ప్రకటన మంచి పరిణామమే అయినప్పటికీ.. వారు, వారి కుటుంబ సభ్యులు మూడేళ్లుగా అనుభవిస్తున్న మానసిక క్షోభకు కేసీఆర్ సమాధానం చెప్పాలి.. గత మూడు సంవత్సరాల కింద కేసీఆర్ ఇదే ఫీల్డు అసిస్టెంట్లను దొంగలు అంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని, వాళ్లు అవినీతి పరులు అంటూ నిండు సభలో అగౌరవ పరిచి చేతగాని వాళ్ళు అని చెప్పి వాళ్లను విధుల నుంచి తీసివేశారు. ఆరోజు అవినీతి ఆరోపణలు మోపి నందుకు చాలా మంది జాబులు కోల్పోయినందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇవాళ మళ్లీ అదే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేస్తారో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్ లను తక్షణమే విధుల్లోకి తీసుకుని నిండు సభలో వాళ్లందరికీ కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాలుగా వారు నష్టపోయినా వేతనాన్ని అందించాలి. ఆత్మహత్యకు పాల్పడ్డ ఫీల్డ్ అసిస్టెంట్ ల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. కెసిఆర్ కు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కన్నం యుగేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గణపతి, పట్టణ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి, రాంరెడ్డి,కోరె సుధాకర్, నాంపల్లి కుమార్,బూర పద్మ,వేశాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.