పై స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉందని బోగారం అండర్ పాసింగ్ మాత్రమే ముస్థాబు చేసిన అధికారులు
కొమ్మాయిగూడం,సిరిపురం వంతెనలు కూడా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కొరిన సిపియం బృందం
కొమ్మాయిగూడం బ్రిడ్జి ప్రత్యేకంగా పరిశీలించిన రైల్వే జి.యం
అధికారులపై అసంతృప్తి,వెంటనే సమస్య పరిష్కరించాలని జి.యం ఆదేశాలు
రామన్నపేట మండలంలో రైల్వే లైన్ పర్యవేక్షించిన దక్షిణమద్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య పర్యవేక్షించారు. బోగారం- అండర్ పాసింగ్ వంతెన పరిశీలించారు. జనరల్ మేనేజర్ పర్యవేక్షణ ఉందని సమస్యలేని బోగారం అండర్ పాసింగ్ కు అద్దాలు పెట్టి,రంగులేసి శుద్దిచేసి ముస్థాబు చేశారు. సిపియం మండల కమిటి బృందం ఆద్వర్యంలో కొమ్మాయిగూడం,సిరిపురం వంతెనల మూలంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వాటిని పరిశీలించాలని వినతిపత్రం ఇచ్చి సమస్యను విన్నవించడంతో కొమ్మాయిగూడం అండర్ పాసింగ్ రైల్వే లైన్ పరిశీలించి క్రింది స్థాయి అధికారులపై అసంతృప్పి వ్యక్తం చేశారు. నిత్యం నీరు నిండి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని,దర్మారెడ్డిపల్లి కాల్వ నీరు నిత్యం ప్రవహిస్తుండటంలో వంతెనలోకి నీరు రావడం జరుగుతుంది,సంపులో ఉన్న నీటికి శాశ్వత పరిష్కారమార్గం చూపాలని కొమ్మాయిగూడం గ్రామ సర్పంచ్ జల్లల లక్ష్మమ్మపెంటయ్య జి.యం కు విన్నవాంచారు. సానుకూలత వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక రైల్ లో వచ్చిన జి.యం వెంట సుమారుగా 150 మంది క్రింది స్థాయి అధికారులు,పోలీసు,సిబ్బంది ఉండి అన్ని రకాల పరిశీలనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కమిటి సభ్యులు జల్లల పెంటయ్య,మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,టౌన్ కార్యదర్శి గాదె నరేందర్,గొరిగె సోములు,మేట్టు శ్రవణ్,కూనూరు దాసు,ఎర్ర కాటం,ఎర్ర రవిందర్,పొలగోని స్వామి,వీరమళ్ళ సైదులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.