రామప్ప దేవాలయం అభివృద్ధి పనులు పరిశీలించిన -సందీప్ సుల్తానియా

తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్యదర్శి సందీప్ సుల్తానియా ఐఏఎస్ మరియు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ స్మిత ఎస్ కుమారి,జిల్లా కలెక్టర్ గారితో కలిసి రామప్ప దేవాలయం అభివృద్ధి పనులు పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
రామప్ప అభివృద్ధి కి సహకరించాలి
ఈ రోజు వేంకటా పూర్ మండలం లోని పాలం పేట గ్రామములోని శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అభివృద్ధి పనులు చేయాలని పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తనియ గారికి పలు అభివృద్ధి పనుల గురించి వివరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
రామప్ప ఆలయంలో చేయవలసిన పనులు
రామప్పకు కుడివైపున ఉండే కామేశ్వర ఆలయ పున:నిర్మాణం చేపట్టాల్సి ఉంది
ఆలయ ఎదురుగా ఉన్న నందీశ్వరుడి విగ్రహ మండపం నిర్మించాలి
పరిసరాల్లో చిన్న ఆలయాలు, చెరువు కట్టపై త్రికూటాలయం, కళ్యాణ మండపం, తదితర 8 గుడులకు మరమ్మత్తులు చేపట్టి సిద్దం చేయాలి
పర్యాటకులు భక్తులు సౌకర్యార్దం ఆలయ సమీపంలో చెరువు కట్ట వద్ద శాశ్వత పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి
ఆలయ పరిసరాలు , గార్డెన్ సుందరీకరణ, ఖాళీ స్థలాల్లో గార్డెన్ ను విస్తరించాలి
తూర్పు రహదారి వరదలకు కొట్టుకుపోతుంది శాశ్వత పరిష్కారం చూపాలి
భక్తులకు విడిది సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని కాటేజీలు, అంతర్జాతీయ స్థాయిలో హోటళ్ల నిర్మాణం జరగాలి
బస్సు సౌకర్యం కల్పించాలి
జంగాలపల్లి – రామప్ప మధ్యలో నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలి
ఎటిఎం, సీ సీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధి లు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.