తెలంగాణా రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు రచించిన రాజ్యాగం నడుస్తుందా కల్వకుంట రాజ్యాగం నడుస్తుందా అని ప్రశ్నించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు. శాసన సభా సమాశాల్లో ప్రజల గొంతును వినిపించేందుకు ప్రజల సమస్యలను ప్రశ్నించేందుకు ఎలుగెత్తిన గొంతును అధికార దురహంకారం తో నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు పాయల్ శంకర్ గారు. అసెంబ్లీలో భారతీయ జనతా MLA లను సస్పెండ్ చేయడం కెసిఆర్ దురహంకారానికి పరాకాష్ట అన్నారు. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, రాజా సింగ్ ల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఆదిలాబాద్ లోని కలెక్టర్ చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శన లో భాగంగా కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. వెంటనే బేషరతుగా MLA ల పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నాయకులు వేణుగోపాల్ లోక ప్రవీణ్ రెడ్డి. లాలా మున్న.దినేష్ మటోలియా. విజయ్ మహేందర్. సుమ రవి. జోగు రవి. ముకుంద్ రావు.శ్రీనివాస్.ఆశిష్. సంతోష్… సేకవత్ . కృష్ణ యాదవ్ రాజేష్ వేదవ్యాస్ తదితరులు