రాష్ట్రంలో బిజెపి పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి- రాథోడ్ రమేష్

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బిజెపి పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు.ఖానాపూర్ నియోజకవర్గంలోని జెకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కడం, ఖానాపూర్,ఖానాపూర్ పట్టణ మండలాల బిజెపి నాయకులతో సమావేశంలో నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జెండావిష్కరణ చేసి,జ్యోతిప్రజ్వలన చేసి,కార్యక్రమానుద్దేశించి మాట్లాడుతూ..అధికార టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళానీ పిలుపునిచ్చారు. ఖానాపూర్ నియోజకవర్గంలో భాజాపా గెలుపు తథ్యమని సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
ప్రజల గుండెల్లో బిజెపి పార్టీ ఉందని,ఆ ప్రజలను చైతన్య పరుస్తూ, ఇంటింటికీ తిరిగి బూత్ కమిటీలు,మండల కమిటీల నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టాలని సూచించారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు సిద్దంగా ఉండాలన్నారు.
రైతు సమస్యలపై, ప్రజా సమస్యలపై గ్రామ స్థాయిలో పోరాటం చేయాలని కోరారు.
అన్నారు.ఖానాపూర్ వరి కోనుగోలు కేంద్రాల్లో రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు.
రైతులకు వరి పంట వేయోద్దని మోసం చేసిన ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు సంఘటితం కావాలన్నారు.రైతులు కష్టాల్లో ఉంటే స్థానిక ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ లు ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మండలాల అధ్యక్షులు నాయిని సంతోష్,జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాజశేఖర్, ఖానాపూర్ అధ్యక్షులు టేకు ప్రకాష్,కడెం అధ్యక్షులు ధర్మాజీ కిష్టయ్య, ప్రధానకార్యదర్శులు దేశాయ్ రాము,పందిరి మోహన్,పెద్ది రమేష్,మందపెళ్లి రమేష్ ఉపాధ్యక్షులు ఏనుగందుల రవి,,సీనియర్ నాయకులుకొండాపురం , తోకల బుచ్చన్న, డి. మల్లయ్య మైలారాపు గంగాధర్,.రవీందర్ రెడ్డి,రవీందర్ గౌడ్,అంకం మహేందర్,పిట్టల భూమన్న,గిరి, లాండారి కిషన్ ,జిల్లా మోర్చా నాయకులు ఒడ్నాల రాజేశ్వర్,గంగాధర్,సింగారపు లింగన్న.లక్కవతుల రాజేశ్వర్ గట్టు శ్రీనివాస్, పరమేష్ గౌడ్ ,బీజేవైఏం జిల్లా నాయకులు ఉపేందర్,శ్రావణ్,మనోజ్,ఆయా మండలాల బూత్ అధ్యక్షులు,శక్తి కేంద్ర ఇంచార్జీ లు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.