hanumakonda news local news telugu news

నిర్వీర్యం అవుతున్న కుమ్మరి కుల వృత్తిని అధునికరించడానికి రాష్ట్రవ్యాప్తంగా 320 మంది కుమ్మరి వృత్తిదారులకు వృత్తి నైపుణ్యత శిక్షణను అందిస్తూ ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలతో ఆధునీకరమైన పనిముట్లను బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై యూనిట్లను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనుమరుగవుతున్న కుల వృత్తులకు చేయుతనిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కుల వృత్తులకు జీవం పోయడం జరుగుతుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, కుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు…

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.