http://www.e6news.com/రాష్ట్ర-ప్రజల-సంక్షేమమే/

వరంగల్ రూరల్ జిల్లా.

…ఎమ్మెల్యే చల్లా…

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమతమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.

మంగళవారం ఆత్మకూరు మరియు దామెర మండలాలకు చెందిన నిరుపేద క్రైస్తవులకు ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ గ్రామంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు పంపినిచేయడం జరిగింది.

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పారదర్శకంగా అందిస్తున్న ఘనత కేసీఆర్ గారికి దక్కిందన్నారు.

అన్ని మతాల ప్రజలను అక్కున చేర్చుకుంటు,
అంతరించి పోతున్న కులవృత్తులను కాపాడుకుంటూ వారికి అండగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో
ఆత్మకూర్ మండల ఎంపిపి మార్క్ సుమలత రజనికర్ గౌడ్, దామెర మండలాల ఎంపిపి కాగితాల శంకర్, రేండు మండలాల జేడ్పిటిసి లు, మరియు పల్లేపాటి దామోదర్, మాజి వరంగల్ గ్రీన్ మార్కెట్ చైర్మన్ కోంపల్లి ధర్మరాజు, ఆత్మకూర్ రైతు సమన్వయ సమితి కన్వీనర్ ఏంకాతల రవీందర్, గుడేపాడ్ మార్కెట్ చైర్మన్
కాంతల కేశవరెడ్డి ,స్థానిక సర్పంచ్ మాదాసి అన్నపూర్ణ-రాజు, రేండు మండలాల వైస్ ఎంపిపిలు, ఎంపిటిసి లు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.