1ఏప్రియల్ (నడిగూడెం )
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించి, పాత విద్యుత్ టారిఫ్ విధానాన్ని కొనసాగించాలని రత్నవరం గ్రామ ఉప సర్పంచ్ మొలుగూరి ఉపేందర్ శుక్రవారం పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోందని సమాజం కరోనా భారీ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇబ్బందులు పడుతున్న ప్రజలు మీద రాష్ట్ర ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలు పై చిలుకు సామాన్య ప్రజల మీద భారం మోపిందని, ఒక పక్క ధనిక రాష్ట్రమంటూ మరోపక్క రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ లక్షల కోట్ల అప్పులు చేస్తుందని, నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతూ అత్యంత సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రజల పై విద్యుత్ చార్జీలు పెంచి అదనపు భారం మోపటం చాలా దారుణమని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజలపై భారం మోపడం ముఖ్యమంత్రికి తగదని సామాన్య మధ్యతరగతి ప్రజలు గ్యాస్, పెట్రోల్ డీజిల్ ఆయిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరగటం వల్ల ఇప్పటికే ప్రతి కుటుంబానికి దాదాపు నెలకు రెండు, మూడు వేల రూపాయల అదనపు భారం పెరిగిందన్నారు., ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచడం చాలా దుర్మార్గమైన చర్య అని, విద్యుత్ చార్జీలు పెంచబోమని మాయ మాటలు చెప్పి ఇప్పుడు సామాన్య మధ్యతరగతి కుటుంబాల మీద విద్యుత్ చార్జీల భారం మోపటం తగదని
వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించి ప్రజల మీద వేసిన అదనపు భారం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు