రాష్ట్ర వ్యాపితంగా దళితులందరికి దళిత బంధు అమలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాలు చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటూ సీపీఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 13 న చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఐ( ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం .డేవిడ్ కుమార్ తెలిపారు.
సిపిఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల పరిస్థితి అధ్వానంగా మారిందని దళితులు
అభివృద్ధి కోసం పాటు పడుతాను చెప్పిన మన ముఖ్యమంత్రి గార “దళితబందు” పథకాన్ని ప్రవేశపెట్టారు.హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్బంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి టీవీ లలో ఒక గంటపాటు ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు మొదటగా తన దత్తత గ్రామమైన వాసాలమర్రి లో ప్రవేశపెట్టి ఆ తరువాత రాష్ట్రంలో 4 మండలాలకు ప్రేవేశపెట్టి మన జిల్లా లో తిరమలగిరి ఎంపిక చేసిన తరువాత నియోజక వర్గానికి 100 యూనిట్లు ఇస్తానని ఆ పథకాన్ని మెడిపండు చందంగా మార్చాడు. చీవరికి ఈ పథకం trs పార్టీ కార్యకర్తల పథకం మార్చడంMLA లు ఫైనల్ చేసిన పేర్ల కు మాత్రమే అర్హులు అని అనటం చాలా విడ్డురంగా ఉందన్నారు .దీని ఉద్దేశం దళితులు అందరూ TRS పార్టీలో ఉండాలని బహిరంగానే చెప్పకనే చెప్పాడు.కానీ దళితబందు పైసలు TRS పార్టీ వీ కాదు ,ఇది ప్రజల నుండి పన్నుల రూపం లో వచ్చే పైసలు అని మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.ఏప్రిల్ 13 న జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు కదలిరావలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో IFTU జిల్లా కార్యదర్శి గంట నాగయ్యPDSU జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్,IFTU జిల్లా నాయకులు దేసోజు మధు,టౌన్ నాయకులు సయ్యద్,కొండేటి సంజీవ రెడ్డి,బత్తుల విరేశ్,అబ్రహం,హమాలి యూనియన్ నాయకులు హరి,జలగం వెంకన్న,చిక్కుల నరేష్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.