రాష్ట విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలి - జంగా రాఘవరెడ్డి

జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల్లో ఒకటైన కాజీపేట్ రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి.

రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం తక్షణమే రద్దు చేయాలి.

కాజీపేట్ కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్‌ ఫ్యాక్టరీ సాధన కోసం దేనికైనా సిద్ధమన్నారు.

కాజీపేట్ కోచ్‌ ఫ్యాక్టరీ 20 ఏళ్ల కల అని, కోచ్‌ ఫ్యాక్టరీ కోసం వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ కేటాయించాలని విభజన చట్టంలోనే ఉందన్నారు.

కోచ్‌ ఫ్యాక్టరీతో పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, కేంద్రం మోసం చేసిందన్నారు జంగా.

తెలంగాణలోని బీజేపీ & టిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే కేంద్రంతో పోరాడి కోచ్‌ ఫ్యాక్టరీ తీసుకురావాలని సవాల్‌ చేసారు.

రైలు డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ మాకొద్దని, కోచ్‌ ఫ్యాక్టరీ కావాలని డిమాండ్‌ చేశారు.

కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే 150 ఎకరాలు సేకరించామని, అయితే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు.

ఏం ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లుఅడుగుతారని ఆయన ప్రశ్నించారు.ఇంకా ఎన్నిఅబద్ధాలు ఆడతారు? తెలంగాణ ప్రజల్ని ఎంత కాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ అంటే భారతీయ బొంకుడుపార్టీ అని తేలిపోయిందని జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి  చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదులమీద తెలంగాణ రాష్ట్ర నిర్మాణం చేస్తే బీజేపీ, టిఆర్ఎస్ అబద్దాల పునాదులపై అధికారం కోసం అర్రులుచాస్తోందని విమర్శించారు.

ఇప్పటి దాకా బీజేపీ బండి, గుండు, తొండి మాటలతో ప్రజల చెవుల్లోపువ్వులుపెట్టారని అన్నారు.

ఇప్పుడు ఏకంగా రాష్ట్ర బీజేపీ చెవుల్లో కేంద్రం పువ్వులు పెట్టిందనారు.

తెలంగాణకు అన్యాయంచేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టు మాదిరిగానే కాజీపేట రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి బిజెపి మంగళం పాడిందన్నారు. కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు మార్లు
పార్లమెంటులో టీపీసీసీ అధ్యక్షులు & ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రాన్ని ప్రశ్నించిన కానీ ఏటువంటి సమాధానం తప్పించుకుంటుంది.

తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ సాధించే వరకు మా పోరాటం ఆగదు, మరింత ఉగ్రరూపంగా ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.