రిజర్వాయర్ క్యాంపు వద్ద నిరసన కార్యక్రమం

ఈరోజు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ క్యాంపు వద్ద నిరసన కార్యక్రమం చేస్తున్న గౌడ సంఘ కార్మికులకు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి గారు సంఘీభావం ప్రకటించారు.
అనంతరం జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ కల్లు గీత కార్మికుల కోసం రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
రాష్ట్రంలో కల్లు గీత కార్పోరేషన్ పరిధిలో 4800 సంఘాలున్నాయని వివరించారు.
గీత వృత్తిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అధునాతన యంత్రాలను అందించాలని ఆయన కోరారు.
జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు శివారులో నిర్మిస్తున్న రిజర్వాయర్ తో సుమారు వెయ్యి తాటిచెట్లు ముప్పునకు గురై మూడొందల గీత కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
తాటి చెట్టుకు రూ ఇరవై వేల చొప్పున పరిహారం అందించడంతోపాటు 25 ఎకరాలలో తాటి చెట్లు పెంచి గీత కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రిజర్వాయర్ నిర్మాణంతో నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను.
కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోయి తమ ఇష్టానుసారంగా ప్రజలను మోసం చేస్తున్న ఈ కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే గానీ గీతకార్మికుల గానీ రైతులకు గానీ విద్యార్ధులు గానీ న్యాయం జరగదని కావున కాంగ్రెస్ పార్టీ కి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో చేతిగుర్తుకు ఓటువేసి రాములునాయక్ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జఫర్గడ్ మండల పార్టీ అధ్యక్షులు ఐలయ్యగారు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.