నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు షేక్ హుస్సేన్ సాహెబ్ విద్యారంగంలో అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు పేర్కొన్నారు.
గురువారం ఆయన సంతాప సభలో హుస్సేన్ సాహెబ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ పేర్కొన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఎనలేని సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు. వారు అనేక మంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాసాని వెంకటేశ్వర్లు, ఎంపీపీ యాతాకుల జ్యోతిమధుబాబు, మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి నాయకులు దేవభక్తుని సురేష్, ఒంటిపులి నాగరాజు, పాలడుగు ప్రసాద్, బాణాల నాగరాజు, ఆంజనేయులు, నూనె నాగన్న,మండల ప్రధాన కార్యదర్శి బడేటి చంద్రయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సిరిపురం గ్రామ పెద్దలు, హుస్సేన్ సాహెబ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
