రేగొండ లో వైన్స్ షాప్ ల మూడు ముక్కలాట

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బ్రాందీ షాపు యజమానులు సిండికేట్ గా మారి ఇష్టారీతిన వ్యవరిస్తున్నారు. మండల కేంద్రంలో మూడు వైన్ షాపులు ఉండగా విచిత్రంగా రెండు వైన్ షాప్ లను బెల్టుషాపుల కే అమ్మడం కోసం కేటాయించారు. మరో బ్రాందీ షాపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూసివేయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 11గంటలకు తీసి సాయంత్రం 7 గంటలకే మూసి వేస్తున్నారు. రైతులు, కూలీలు, పొద్దంతా కాయకష్టం చేసి తమ కష్టాన్ని మర్చిపోయేందుకు కాస్తంత మద్యం సేవిద్దామని వైన్స్ షాప్ కి వెళితే ఏడు గంటలకే బంద్ చేయడంతో గత్యంతరం లేక బెల్టు షాపులను ఆశ్రయిస్తున్నారు. బెల్ట్ షాప్ వారు క్వార్టర్ సీసా కు 40 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మద్యం దుకాణం దారులు మాకు క్వార్టర్ సీసా కు అదనంగా 30 రూపాయలు వసూలు చేస్తున్నారు.కావున అందుకే ఇలా ఎక్కువ ధర తీసుకుంటున్నామని సమాధానం చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే మద్యం దుకాణం దారులు ఉదయం ఎనిమిది గంటలకే మండలంలోని గ్రామాలకు ఆటోల ద్వారా, ట్రాలీల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు.గ్రామాలలో మంచినీళ్లు దొరకడం కష్టం అయింది గానీ, మద్యం మాత్రం ఏరులై పారుతున్నది. దాంతో గ్రామాల్లో యువకులు మద్యానికి బానిసై, మద్యం మత్తులో ఆవేశానికి లోనై, కుటుంబంలో కలహాలు ఏర్పడటం వలన పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి.భావి భారత పౌరుల భవిష్యత్తు మద్యం మత్తులో బజారుపాలు అవుతున్నది.ఇంతటి గలీజ్ దందా జరుగుతుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప, మద్యం షాపు యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా గాని నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు తప్ప వైన్స్ యాజమాన్యం పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీని ఆంతర్యమేమిటో అధికారులు తెలపాలని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు ఏమైనా వైన్స్ యాజమాన్యం నుంచి ముడుపులు ముడుతున్నాయా ? అంటూ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అలసత్వం వీడి, రేగొండ వైన్స్ యాజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


రేగొండ వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు డిమాండ్

రేగొండ మండల కేంద్రంలోని వైన్స్ షాపుల యజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు డిమాండ్ చేశారు. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ,సమయపాలన లేకుండా వైన్స్ లను నిర్వహిస్తూ సిండికేట్ గా మారి మద్యం ప్రియులను నిట్టనిలువునా దోపిడీ చేస్తున్న రేగొండ వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గత ఎక్సైజ్ సూపరిండెంట్ కు వినతి పత్రం సమర్పించినా నేటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని, కనీసం నూతనంగా వచ్చినా ఎక్సైజ్ సూపరిండెంట్ అయినా వీరిపై తగిన చర్య తీసుకోవాలని, జన నివాసాలలో ఉన్న వైన్స్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ముందు ,రేగొండ మండల కేంద్రంలోని వైన్స్ ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని బంధు సాయిలు హెచ్చరించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.