రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే మహ ధర్నా ను జయప్రదం చేయండి

నిలువ నీడలేని నిరుపేద లు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే గుడిసెలను బుల్డోజర్ తో కూల్చి కాల్చడం నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ఇప్పటికే నివసిస్తున్న గుడిసె వాసులకు జీవో 58 ప్రకారం వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం రేపు కలెక్టర్ కార్యాలయం ముందు జరగబోయే మహాధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు.
ఈరోజు పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశం జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి మాట్లాడుతూ…. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ఇల్లు లేని పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎన్నికల హామీని నేటికీ నెరవేరకపోవడంతో నిరుపేదలు ఇంటి కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ భూములు చెరువులను కొంతమంది వ్యాపారులు భూ కబ్జాదారులు ఆక్రమణకు గురి చేస్తూ ఉంటే ఆ భూముల రక్షించడానికి ఇల్లు లేని నిరుపేదలకు గుడిసెలు వేస్తుంటే పోలీసు నిర్బంధం ప్రయోగించడం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఇప్పటికే అనేక ఏళ్ళ నుండి గుడిసె వేసుకొని జీవిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు జీవో నెంబర్ 58 ప్రకారం పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

మహాధర్నాకు తమ్మినేని రాక
పేదలు వేసుకున్నా గుడిసెలకు పట్టాలివ్వాలని నిర్వహించబోయే మహాధర్నాకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు గారు హాజరుకానున్నారు ఈ ధర్నాలో ఇల్లు లేని నిరుపేదలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చక్రపాణి పిలుపునిచ్చారు

ఈ సమావేశంలో జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు వాంకుడోత్ వీరన్న, రాగుల రమేష్, , మంద సంపత్, డి.తిరుపతి, ధరావత్ భాను నాయక్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.