సిపియం టపాసులు పేలుస్తూ సంబరాలు
రైతాంగ పోరాటానికి జేజేలు..
సిపిఎం గ్రామ కార్యదర్శి కందాల రమేష్
……. ….. ….
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దుకై భారతదేశ రైతాంగం ఏడాదిగా సాగిస్తున్న చారిత్రాత్మక ఉద్యమం ఫలితంగా మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని, ఇది రైతాంగ ఉద్యమ విజయమని సిపిఎం గ్రామ కార్యదర్శి కందాల రమేష్ తెలిపారు.
శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో టపాసులు పేలుస్తూ విజయోత్సవ సంబరాలను జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ ఉద్యమం చారిత్రాత్మక మైందని, ఈ పోరాటంలో 750 మంది రైతులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని తెలిపారు. దేశ ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం, గత ఐదు రాష్ట్రాల ఎన్నికల పరాబావం, రాబోయే ఎన్నికల్లో ఓటమి సంకేతాల నుంచి తప్పించుకునేందుకు అనివార్యమైన స్థితిలో ప్రధాని మోడీ మూడు నల్ల చట్టాలను రద్దు చేసారని, వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన విద్యుత్ విధానాన్ని రద్దు చేయాలని, రైతాంగంపై కాల్పులు జరిపిన కేంద్ర మంత్రి కొడుకును శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతాంగ పోరాటానికి జేజేలు ప్రకటించి, పోరాట అమరులకు జోహార్లు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అల్లి శ్రీనివాస్ రెడ్డి,షేక్ షరీఫ్,పుల్లయ్య, మౌలానా, వీరన్న, లింగన్న, రాజశేఖర్, వెంకటేష్,మహేష్, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *