రైతాంగ సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి పట్టదా


-సామాజికవేత్త మాడిశెట్టి అరుణ్ కుమార్ గారు
ఈరోజు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఆయన హాజరైనారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తమ రాజకీయ స్వలాభం కోసం అనేక చట్టాలను రాత్రికి రాత్రే ఆమోదం తీసుకున్న ప్రభుత్వం నేడు రైతుల కోసం ఎందుకు చట్టాలను రద్దు చెయ్యటం లేదని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల స్వలాభం కోసం చేసే ప్రభుత్వం అని రైతులు పెట్టిన పెట్టుబడి కాకుండా 50 శాతం మద్దతు ధరను ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు దాసోహం చేస్తోందని ప్రశ్నించారు. అలాగే మాటల్లో స్వదేశం అనే పేరు చెబుతూ చేతల్లో మాత్రం విదేశీయులకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. ఈ చట్టాల వలన రైతులేకె కాక వినియోగదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల దేశం లోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే అనేక రకాల మందుల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతింటుందని దాన్ని కట్టడి చేయలేని ప్రభుత్వం చట్టం చేయడం వల్ల పూర్తిగా వారి లాభాల కోసమేనని అని అన్నారు బిజెపి ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల కోసమే పని చేస్తుందాని దేశ ప్రజానీకానికి పని చేయడం లేదని ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారని తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టిఆర్ఎస్, వైఎస్ఆర్ సిపి, టిడిపి, ఎంఐఎం, తదితర పార్టీలు తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల తో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే దేశ వ్యాప్త ఉద్యమాలకు మద్దతు పలుకుతూ అనేక రూపాల్లో కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువ రైతులు మరియు యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి, జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్ ,యువ న్యాయవాది సంపత్, రైతులు జి రాములు, నరేందర్, రమేష్, రాజు ,లక్ష్మణ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.