రైతుకు మద్దతు ధర ప్రభుత్వం చెల్లించాలి

ప్రభుత్వం ధర కల్పించేందుకు వరకు 48 గంటల నిరసనదీక్ష చేపట్టిన
టిపిసిసి కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో వరికి మద్దతు ధర కల్పించడం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నట్లు టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచనల మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో రైతులకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో కొనుగోలుదారులు ఆడింది ఆటగా పాడింది పాటగా అన్న చందంగా తయారైందని అన్నారు శుక్రవారం నాడు మంచి రకాలకు రూ 1800 చెల్లించిన మిల్లర్లు శనివారం నాడు 1200 మధ్య ధర పలకడం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ మార్కెట్ను సందర్శించ లేదని అన్నారు మిల్లర్ లతో చైర్పర్సన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు శనివారం రోజున కలెక్టర్ మార్కెట్ లో సందర్శించి పది యాభై రూపాయలు మద్దతు ధర కల్పిస్తామని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు 60 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి టిఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పుకోవడం టిఆర్ఎస్ నాయకుల కే చెల్లిందని అన్నారు నాడు ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇ ఉన్నప్పుడు రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించారని గుర్తుచేశారు నియోజకవర్గ రైతుల ఓట్లతో నెగ్గిన జగదీశ్వర్ రెడ్డి జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరింత ఆందోళనకు 48 గంటలు దీక్ష చేస్తున్నామని ఆయన తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.