తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో ఒకటైన రైతుబంధు పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని టిఆర్ఎస్వి ప్రవీణ్ నాయక్అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పేర్కొన్నారు. రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ముఖాలలో చిరునవ్వులు కనబడుతున్నాయి. రైతు కుటుంబాలకు చెందిన అందర్నీ సంపన్నులను చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు. వానకాలం పెట్టుబడి కోసం ఎకరానికి 5000 రైతుబంధు పథకాన్ని రైతులకు అందించడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుబిడ్డ అవస్థలు పాలు కాకూడదని ఎవరి దగ్గర పెట్టుబడి కోసం చేయి చాచి అడగకూడదు అనే గొప్ప మనసున్న మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు