రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను, కార్మిక కోడ్ లను, విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలి

రైతుల పొట్టగొట్టే రైతు వ్యతిరేఖ చట్టాలను, కార్మిక చట్టాలను, విద్యుత్ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు మోకు కనకారెడ్డి, ఆది సాయన్న లు డిమాండ్ చేశారు.

దివి: 18/02/2021గురువారం రోజున దేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు, ప్రజాసంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీసులు రైతు, ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించడం జరిగింది నాయకులు అక్రమ అరెస్టులను ఖండిస్తూ పోలీస్ స్టేషన్లోనే నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్బంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు మోకు కనకారెడ్డి, ఆది సాయన్న లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని సహనశీలంగా రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు. లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో పట్టుదలతో పోరాడుతున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, నియంతృత్వం ప్రదర్శిస్తుందని తెలిపారు. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు మేధావులు, ప్రజాస్వామిక శక్తులు అందరూ ఆందోళనలు చేస్తూ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తూలు చేస్తున్న Bjp మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం లేదని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు, విద్యుత్ సవరణ బిల్లు 2020 కార్మిక, ప్రజల హక్కులను హరించి యజమానులకు యథేచ్ఛగా దోపిడి చేసుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. ఈ చట్టాలన్నింటినీ బేషరతుగా రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నదని అన్నారు. కార్మికులు, రైతులు నరేంద్రమోడీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భుజం భుజం కలిపి పోరాడుతున్నారని తెలిపారు. రైతుల ఉద్యమానికి కార్మిక వర్గం అండగా నిలుస్తూ అనేక సంఘీభావ ఉద్యమాలను నిర్వహిస్తున్నదని అన్నారు. ప్రభుత్వం వెంటనే మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని, ఎలక్ట్రిసిటి సవరణ 2020 బిల్లును రద్దు చేసుకోవాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కార్మిక చట్టాల మార్పు చర్యలను ఉపసంహరించుకోవాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇర్రి అహల్య, రాపర్తి రాజు, రాపర్తి సోమన్న, పోత్కనూరి ఉపేందర్, R.మీట్యానాయక్,బోట్ల శేఖర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు, కార్మికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.