- విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్
నర్సింహులపేట అనుదిన వార్త
నర్సింహులపేట మండలం పడమటిగుడెం శివారు గ్యామాతండాలో 33/11 కె వి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రజలకు, రైతులకు విద్యుత్ ఇబ్బందులు తొలగించేందుకు నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ సబ్ స్టేషన్ రైతులకు సంబంధించిన పోలాలకు విద్యుత్‌ను సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల, రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. సబ్ స్టేషన్ల నిర్మాణంవల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయాని చెప్పారు. ఈ
కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సంగీత, ఎంపీపీ టేకుల సుశీల యాదగిరి రెడ్డి, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ వాలాద్రి మల్లారెడ్డి ,సొసైటీ చైర్మన్ సంపేట రాము, మధుసూదన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..