రైతులను నష్టపరిస్తే సహించేదేలేదని జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు అన్నారు.చిల్పూర్ మండలంలోని కొండాపూర్ శివారు ఎర్రగుంట తండాలో రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కృష్ణస్వామి అనే దళారి వడ్లు కొనుగోలు చేసి డీసీఎంలో తరలిస్తుండగా డిసిఎంను మార్కెట్ చైర్మన్ గారు స్వాధీనం చేసుకున్నారు.తదుపరి వారు మాట్లాడుతూ…..రైతులు ఎవరూ కూడా దళారులకు తక్కువ ధరకే వడ్లు అమ్మి నష్టపోకూడదని తెలిపారు.అలాగే ఐకేపీ కేంద్రాల్లో గానీ పిఏసిఎస్ కేంద్రాల్లోనే వడ్లు అమ్మాలని కోరారు.అంతేకాకుండా దళారులు సన్న వడ్లు కొనుగోలు చేయడంతో ఐకెపి,పిఏసిఎస్ కేంద్రాల్లో దొడ్డు వడ్లు కొనుగోలు గాక కేంద్రాలు మూసివేయడం జరుగుతుందన్నారు.మార్కెట్ పరిధిలో ఎక్కడా కూడా దళారులు వడ్లు కొనుగోలు చేసిన వారిపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదుచేయడం జరుగుతుందని హెచ్చరించారు.కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు.