రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ నిరసన

ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 31 వ వార్డు (బంజారహిల్స్) లో కొవ్వొత్తులతో పోరాటంలో అమరవీరులైన రైతులకు నివాళులర్పిస్తూ అదేవిధంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ// బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా తన విధానాలు దేశంలో ఉన్న పేద మధ్యతరగతి అదేవిధంగా రైతాంగానికి వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని గత నెల రోజులకు పైగా ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ప్రజలు రైతులు పోరాటం చేస్తా ఉంటే ఢిల్లీలో ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఈ పోరాటానికి ప్రజలు మద్దతుఇయ్యవలసిన అవసరం ఉన్నదని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిల్లలతో సహా ఢిల్లీలో పోరాటం చేస్తున్న ఆందోళనలు అర్థం చేసుకొని నరేంద్రమోడీ గారు వెంటనే తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు. పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ. నాయకురాలు మహిళా సంఘం పట్టణ కార్యదర్శి దాసరి మంజుల. నాయకులు హేమలత, అనిత, రజిత, రాధిక, మంజుల, శాంతాబాయి, రత్న, కిరణ్, చరణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.