రైతుల ధాన్యాన్ని కొనడంలో ప్రభుత్వం ఐకెపి సెంటర్లు విఫలం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య

రైతుల ధాన్యాన్ని కొనడంలో ప్రభుత్వం ఐకెపి సెంటర్లు విఫలం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య,రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం నేడు వాటిని అమలు చేయడంలో విఫలం చెందిందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నారు,శుక్రవారం రోజున జఫర్గడ్ మండల కేంద్రంలోని తిమ్మాపురం గ్రామాన్ని రైతు సంఘం బృందం ఐకెపి సెంటర్లను సందర్శించారు, ఈసందర్భంగా సోమయ్య పాల్గొని మాట్లాడుతూ అతివృష్టి కారణంగా రైతులు నిండా మునిగి ఉండి చేతికొచ్చిన పంట ధాన్యాన్నిఅమ్మకుందమని ఐకెపి సెంటర్లకు పోతే కొనడం లేదని వారు అన్నారు, రైతులు పండించిన పంట నల్లగా ఉందని మచ్చ పేరుతో రైతులు కాంటపెట్టిన ధాన్యాన్న వెనక్కి తిప్పి కొట్టారని ప్రభుత్వం, అధికారులు, మిల్లర్ లతో వెంటనే మాట్లాడి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు, ఇప్పటికే ఢిల్లీలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని చలిని తట్టుకుని నిరసన తెలుపుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం చాలా బాధాకరమని ఐకేపీ సెంటర్లు కానీ మిల్లర్లు, కొనే విధంగా ప్రభుత్వంచర్యలు చేపట్టాలని వారు కోరారు, యా సింగ్ సమయంలో రైతులు నారు పోసే సందర్భంగా రైతులను అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇబ్బంది పెట్టే విధంగా ఉండవద్దని వారు కోరారు,ఈ దేశానికి వెన్నుముక లాంటి రైతుపండించిన పంటను కొనడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని వారన్నారు,ఇప్పటికైనా ప్రభుత్వం రైతు దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజను కొని రైతులకు అండగా నిలవాలని లేనియెడల లో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో గుండె బొఇనరాజు రాజు, యాతం సమ్మయ్య, ఎర్ర కేశవరెడ్డి, ఎర్ర రాజయ్య ,తుమ్మల సాంబమూర్తి, భూతం రాజు, తదితరులు పాల్గొన్నారు,

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.