రైతు ఆరుగాలం పండించిన పంటను దోచుకుతింటున్న మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్

రైతు ఆరుగాలం పండించిన పంటను దోచుకుతింటున్న మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు….

   తేదీ: 03.12.2020 గురువారం అనగా ఈ రోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గోవిందరావుపేట మండల అధ్యక్షుడు ధర్మ అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మిల్లర్ల ఆగడాలను కట్టించి, రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన రాస్తారోకో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు విచ్చేసి జాతీయ రహదారిపై బైఠాయించి తన నిరసనని తెలియజేశారు.
    ఈ కార్యక్రమంలో నల్లెల కుమారస్వామి గారు మాట్లాడుతూ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి మిల్లర్లకు పంపించినాక మిల్లర్లు కావాలని క్వింటాకు 4 నుండి 12 కిలోల వరకు కోత విధిస్తూ రైతు శ్రమను దోచుకుంటున్నారని, దేశానికి అన్నం పెట్టె రైతన్నను దగా చేస్తున్నారని, ముఖ్యంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే తెరాస ప్రభుత్వం రైతులకు నష్టం జరుగుతున్న పట్టించుకోకుండా, మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా మండలానికో సూపెర్వైజరును ఏర్పాటు చేసి మిల్లర్లతో కుమ్మక్కై మరీ రైతులను మోసం చేస్తున్నారని ప్రభుత్వం యొక్క పనితీరుపై మండిపడ్డారు. రైతు లేనిదే రాజ్యం లేదు అలాంటి రైతన్నను సన్న ధాన్యం మాత్రమే పెట్టాలని ఆంక్షలు విధించి ఇప్పుడు సన్న ధాన్యం వద్దు అంటున్న మిల్లర్లను మందలించకుండా రైతు యొక్క శ్రమను దోచుకుతింటున్న మిల్లర్లతో కుమ్మక్కవుతున్నారని వాపోయారు.
   ఇక నుండి అయిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు కోత విధించకుండా తీసుకోవాలని సూచించారు. అలాగే రైతులకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని, రైతుల తరుపున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. ఇక నుండి అయిన మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం కాకుండా రైతులకు అన్యాయం చేస్తున్న మిల్లర్లను మందలించి, కోత విధించకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ మిల్లర్లకు ఉత్తర్వులు జారీ చేయాలనీ తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు రైతు వ్యతిరేఖ చట్టాలను కూడా రద్దు చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
   ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్, ఎస్.సి సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శులు జంపాల ప్రభాకర్, కాడబోయిన రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కణతల నాగేందర్ రావు, మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ. షరీఫ్, ఎస్.టి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్సం కన్నయ్య, ఎంపీటీసీలు గోపీదాసు ఏడుకొండలు, చాపల ఉమాదేవి, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్, ధారావత్ పూర్ణ-గాంగు, సర్పంచులు ముద్దబోయిన రాము, భూక్య సుక్య, లావుడ్య లక్ష్మి-జోగా నాయక్, సనప సమ్మయ్య, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ. కుతుబుద్దీన్, ఉపసర్పంచులు కట్ల జనార్దన్ రెడ్డి, తేళ్ల హరిప్రసాద్, సహకార సంఘ సభ్యుడు జెట్టి సోమయ్య,  మాజీ సర్పంచులు పాయం నారాయణ, పాలెం యాదగిరి, మండల పార్టీ ఉపాధ్యక్షులు రసపుత్ సీతారాం నాయక్, వేల్పుగొండ పూర్ణ, వేల్పుగొండ ప్రకాష్, బానోత్ బాలు, హరి, గూడూరు సదాశివ రెడ్డి, యానాల వెంకట్ రెడ్డి, జంపాల చంద్ర శేఖర్, యాస సత్తిరెడ్డి, తండ కృష్ణ, జల్లెళ్ళ జంపయ్య, రాజబాబు, ఎం. యాదగిరిరెడ్డి, జెట్టి ప్రభాకర్, సామ సమ్మిరెడ్డి, చెరుకుల సురేష్, పంగ శ్రీను, దేపాక ఎల్లయ్య, లక్ష్మి నారాయణ, అలుగుబెల్లి కన్నయ్య, చింత క్రాంతి, జి.అనిల్, సి.హెచ్.కిషన్ రెడ్డి, అరవింద్, సాహిత్, విష్ణు తదితర నాయకులు మరియు 100 మంది రైతులు రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు.
50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.