రైతు చట్టాలను నిరసిస్తూ బస్సు జాతాను జయప్రదం చేయండి

(తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకు కనకారెడ్డి పిలుపు)

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని జనవరి 13న జనగామ జిల్లాలో బస్సు జాతా కార్యక్రమం ఉంట్టుందని, ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా నిలబడి ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

దివి: 12-01-2021 మంగళవారం రోజున పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకు కనకారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపైనా రైతుల ఆందోళన సరైనదేనని అన్నారు. రైతే రాజని చెప్పిన ప్రభుత్వాలు రైతును బిచ్చగాళ్లగా మార్చే చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. నెలల తరబడి ఎముకలుకోరికే చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం దిగిరాకపోవడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడ అర్ధం చేసుకోవచ్చని విమర్శించారు. దేశ వ్యాప్తంగా రైతులు ఈ చట్టాలను రద్దు చెయ్యాలని కోరిన ప్రభుత్వం మొండిగా ప్రవర్తించడం చూస్తుంటే కార్పొరేట్ సంస్థల లాభాలకోసమేనని ప్రజలు గమనించాలని అన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ప్రతినిత్యం ఆకాశానంటుతున్న ప్రభుత్వం ధరలను ఆదిపు చేయడంలో వైఫల్యం చెందిందని తెలిపారు. ఈ ఆందోళనలో అనేక మంది రైతులు చనిపోయిన ప్రభుత్వం వారి మరణాల పట్ల స్పందించకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఎవరికి కొమ్ముకాస్తుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. రైతు మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేఖ చట్టాలను నిరసిస్తూ దివి: 13-01-2021బుధవారం రోజున జనగామ జిల్లాలోని అన్ని మండలాలను కలుపుతూ బస్సు జాతా ఉంట్టుందని అన్నారు. ముందుగా జనగామ మండలం పెంబర్తి గ్రామంలో ఉదయం: 8-00 గంటలకు పెంబర్తిలో ప్రారంభం అవుతుందని అక్కడినుండి ఉదయం: 9-00 గంటలకు జనగామ పట్టణంలోని బస్ స్టాండ్ చౌరస్తా మీదుగా నెహ్రూపార్క్, ఉదయం: 10-30 గంటలకు బచ్చన్నపేట, మధ్యాహ్నం: 12-00 గంటలకు నర్మెట, మధ్యాహ్నం: 1-00 గంటలకు రఘునాథపల్లి, మధ్యాహ్నం: 3-00 గంటలకు లింగాలఘనపురం, సాయంత్రం: 4-00 గంటలకు దేవరుప్పుల, సాయంత్రం: 5-00 గంటలకు పాలకుర్తి, సాయంత్రం: 6-00 గంటలకు జపర్ఘడ్
మండల కేంద్రం మీదుగా రాత్రి 7-00 గంటలకు (G) తమ్మడపల్లి చేరుకుంటుతుందని తెలిపారు. అందుకు విశాలమైన ప్రజానీకం ఈ బస్సు జాతాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక మరియు ప్రజా వ్యతిరేఖ విధానాలను ఎండగట్టుతూ ఢిల్లీ మహా నగరంలో రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలియపరుస్తూ దేశానికి రైతే రాజని, రైతు లేకుంటే రాజ్యమేలేదని నినదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సింగారపు రమేష్, ఎదునూరి వెంకట్రాజం, kvps జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తూడి దేవదానం, బోట్ల శేఖర్, citu పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, Nprd జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాముకుంట్ల చందు, బిట్ల గణేష్, ఐద్వా పట్టణ కార్యదర్శి పల్లెర్ల లలిత, వృత్తి సంఘాల నాయకులు కళ్యాణం లింగం, మారబోయిన మల్లయ్య, ఆవాజ్ నాయకులు md.మైబెల్లి, md.మునీర్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.