రైతు చట్టాలను నిరసిస్తూ బస్సు జాతాను జయప్రదం చేయండి

, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్నకేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకోసం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చారని ఆచట్టాలను నిరసిస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ఈనెల 13న సాయంత్రం పాలకుర్తి మండల కేంద్రానికి చేరుకుంటుందని రైతులు, కార్మికులు, వామపక్షాలు, ప్రతిపక్షాలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, చేయాలని కోరారు,సోమవారం స్థానిక మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ స్మారక భవనం లో సిఐటియు కార్యకర్తల సమావేశానికి సమ్మయ్య అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ నవంబర్ 27 నుండి ఢిల్లీలో రైతులు నల్ల చట్టాలను రద్దు చేయాలని మహోద్యమం కొనసాగిస్తున్నారని అయినప్పటికీ రైతుల డిమాండ్లను పరిష్కరించకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు, ఇప్పటికే 45 మంది రైతులు ప్రాణాలు వదలారని తెలిపారు,రైతు ఉద్యమానికి దేశవ్యాప్తంగా విశాలమైన ప్రజా మద్దతు ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు, ఈ సమావేశంలో సిఐటియు నాయకులు md మైబు,a వెంకన్న, గాదె పాక ఎల్లయ్య, డి రాములు, ఎనగతల సోమ చంద్రు, గాదపాక కొమురయ్య, ఎండి పరిద్,kఅశొక్, తదితరులు పాల్గొన్నారు,*

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.