రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

సిపిఎం జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో వెంగల్ రావు నగర్ డివిజన్ మధుర నగర్ లో నిరసన చేయడం జరిగింది. 28 రోజులుగా ఎముకలు కొరికే చలిలో లక్షలాదిమంది రైతన్నలు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా ఈ వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ కమిటీ నిరసన చేయడం జరిగింది. మూడు వ్యవసాయ వ్యతిరేక రైతు చట్టాలను రద్దు చేయాలి. కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాలు వ్యవసాయాన్ని రైతుల్ని కార్పొరేట్ రంగానికి అప్పజెప్పే ఈ విధంగా ఉన్నాయి ఈ చట్టాలు రైతులకు ,ప్రజలందరికీ వ్యతిరేకమైనవి అని సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్ తెలపడం జరిగింది. 1.నిత్యావసరాల చట్టం తీసేయడం వల్ల మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఇది ప్రజలందరికీ ఇబ్బందికరమే.2 కాంట్రాక్టు వ్యవసాయం వల్ల రైతులను భూమి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నమే నని. 3,మార్కెట్ యార్డ్ ల రద్దు వల్ల ఎం ఎస్ పి కనీస మద్దతు ధర ఉండదని దుయ్యబట్టారు. సిపిఎం పార్టీ గా చట్టాలు వెనక్కు తీసుకునే వరకు రైతులకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ జోన్ కమిటీ కన్వీనర్ రాపర్తి అశోక్ నాయకులు E తార, ఆదిలక్ష్మి ,సుజాత, లక్ష్మీ బాయి ,. తదితరులు పాల్గొనడం జరిగింది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.