రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి
ఈ నెల 8 న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం
రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యావుసం బాగు పడ్డ చరిత్ర లేదు
కార్పొరేట్ కంపెనీలో తో కూమ్మకై న మోడీ
రైతులను దగా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎర్పాటు చేసిన సమావేశం లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లుల ను నిరసిస్తూ ఈ నెల 8 తలపెట్టిన భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నాం అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని, చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు ఉన్నాయని, దేశంలో 80% చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని దేశములో రైతులు పండించిన పంటను ఎక్కడైన అమ్ముకోవచ్చని అంటున్నారు కానీ దాని వల్ల కార్పొరేట్ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవారు మరియు భూస్వాములు మాత్రమే లాభ పడుతారు తప్ప పేద, మధ్య తరగతి చిన్న రైతులు నష్టపోతారని అన్నారు. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించకపోతే దళారుల చేతిలో రైతులు నష్టపోవాల్సి వస్తుందని తెలియజేసారు. అలాగే రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బాగు కొరకు కాకుండా దళారులను, కాంట్రాక్టర్లను పెంచి పోషించడానికి కొత్త చట్టాలు అమలు చేస్తున్నారని వెంటనే అమలు చేసిన కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలనీ అన్నారు. రైతుకు ప్రోత్సాహకర గిట్టుబాటు ధర కల్పించకపోగా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందే మేము చేశామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ రైతులకు ఇందిరా జల ప్రభ, ఉచిత కరెంట్, పంట రుణాల మాఫీలు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ, తెరాస ప్రభుత్వాలు కాదని గుర్తు చేశారు.
కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు బంద్ లో పాల్గొనాలి అని సీతక్క గారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి
మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్, మేడం రమణ కర్,కిట్టు
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.