అభినవ అపర భగీరథుడు సీఎం కేసీఆర్-ఎమ్మెల్యే డా.రాజయ్య

ఉప్పుగల్ రిజర్వాయర్ వద్ద గంగమ్మ తల్లికి చీరే , సారే సమర్పించిన-ఎమ్మెల్యే డా.రాజయ్య

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జులై 23

జఫర్గడ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో ఉప్పుగల్ రిజర్వాయర్ మత్తడి పోస్తుండగా గంగమ్మ తల్లికి పసుపు,కుంకుమ,పూలు, చీరే-సారే సమర్పించిన తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి శాసనసభ్యులు డాక్టర్. తాటికొండ రాజయ్య.
మూడు రోజులుగా కురుస్తున్న తొలకరి వర్షంతో ఉప్పుగల్ రిజర్వాయర్ జలకళను సంతరించుకొని వలుగుపడి,మత్తడి పోస్తూ పొంగిపొర్లుతున్నది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…మత్తడి దునికి అలుగు తన్నుకొని పారినట్టుగా ఉప్పుగల్లు రిజర్వాయర్ అలుగు పడడంతో నా జన్మ ధన్యమైందని అన్నారు.
325 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో,0.5 టీఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో 52000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ఉప్పుగలు రిజర్వాయర్ నిర్మించడం జరిగిందని తెలిపారు.ఆరు నెలల కాలంలోనే ఉప్పుగల్లు రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభమై పూర్తయి తొలకరి వానలకే అలుగుపడి మత్తడి పోయడమనేది నా పూర్వజన్మ సుకృతం అని ఎమ్మెల్యే తెలిపారు.
భవిష్యత్తులో ఉప్పుగల్లు పరిసర ప్రాంతమంత ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్ , జడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్ మార్కెట్ చైర్మన్ గుజ్జురి రాజు వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య ,ఆర్డీఓ క్రిష్ణవేణి , తహశీల్దార్ స్వప్న , ఇరిగేషన్ డిఇ , మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి జయపాల్ రెడ్డి , నియోజకవర్గ క్లస్టర్ కమిటీల ఇంచార్జ్ పసునూరి మహేందర్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి జయపాల్ రెడ్డి మండల రైతు కోఆర్డినేటర్ కడారి శంకర్ మండలంలోని సర్పంచ్ లు ఎంపీటీసీ లు గ్రామ శాఖ అధ్యక్షులు, రైతులు, గ్రామ ప్రజలు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.