రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం

పసుపు కి పదిహేను వేలు మద్దతు ధర ఇవ్వాలని పసుపు నో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని శాస్త్రి నగర్ లో గల కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పసుపు అధికంగా పండిస్తారు ఆరుగాలం పనిచేసి మార్కెట్ గంజి లోకి తీసుకెళ్తే నాలుగు నుంచి ఏడు వేల వరకు ధర పలుకుతోంది పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు పసుపు 15000 మద్దతు ధర ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7 నిజామాబాద్ గంజిలో జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సుకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ హాజరవుతున్నారు కావున అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు ప్రధానంగా పాలకులు ఎన్నికల ఓట్ల కోసం బాండు పేపరు రాసి ఇచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ ఊసే ఎత్తడం జిల్లా ప్రధాన కార్యదర్శి లేదని అన్నారు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే దానికి గిట్టుబాటు ధర అంతర్జాతీయంగా మార్కెట్ ధర పెరుగుతుందని అన్నారు ఈ ప్రాంత ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుందని అన్నారు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల రాజు, నడిపి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.