జాఫర్గాడ్ మండల కేంద్రంలో రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘం 2వ రాష్ట మహాసభలు హుజూర్ నగర్ లో 1 2 3 తేదీలలో జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మినేని వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆరుగాలం కష్ట పడి పంటలు వేసుకొని రైతాంగం పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తుందన్నారు కొత్త కొత్త చట్టాలతో రైతుల జీవితాలతో చెలగాటం అడుతుందన్నారు ఆనాడు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా నిరంకుశ నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి రద్దుకై ఎన్నెన్నో పోరాటాలు చేసినా రైతులు ఈరోజు పాలకులు ఓట్లు దండుకొని పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా సాగుచట్టాలతో ఎడువందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నా చరిత్ర బీజేపీ నరేంద్రమోదీదే అని ఎద్దేవా చేశారు.మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భవిష్యత్ లో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కరన్నారు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయక పోవడం సిగ్గుచేటన్నారు రైతాంగం సాగించినా పోరాటలా స్పూర్తితో ఐక్యంగా రైతులు ముందుకు సాగాలని వచ్చేనెల 1 2 3 తేదీలలో రైతు ప్రజాపోరాటలా పురటిగడ్డ హుజుర్ నగర్ పట్టణంలో జరుగు మహాసభలను ఆయావత్తు రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అబ్బారాబోయిన.మోసలయ్య,మల్లయ్య,రాంచంద్ర యాదగిరి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు
