రైతు సంఘర్షణ సభను జయప్రదం చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు

రాష్ట్ర నలుమూలల నుండి రైతు సంఘర్షణ సభకు తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, రైతుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మ బోజ్జు ధన్యవాదములు తెలిపారు.
సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రైతు సంక్షేమం కోసం ఏకకాలంలో 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు.
ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి 15వెలు ఆర్థిక సహాయాన్ని ఇస్తామన్నారు.
ధరణి పోర్టల్ ను పూర్తిగా రద్దు చేసి రైతుకు న్యాయం చేస్తామన్నారు.
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దూట రాజేశ్వర్, మండల అధ్యక్షుడు సోమోరే నాగోరావ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమాసే వెంకట్ రావ్,ఉపాధ్యక్షులు ముఖాడే ఉత్తం,నాయకులు పరత్వాగ్ విశాల్, గాయక్వాడ్ భగవాన్,మెస్రం నగేష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.