రైతు సంఘర్షణ సభ విజయవంతం చెసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ సభకు వచ్చిన స్పందన చూసి టి ఆర్ ఎస్ నాయకుల వేన్ను లో వణుకు పుట్టింది
రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయి అర్హత కేటీఆర్ కు లేదు
బిజెపి టిఆర్ఎస్ దొందు దొందే
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు హన్మ కొండ కాంగ్రెస్ భవన్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ గారు
రాజరిక పాలన ఎలా ఉంటుందో ప్రజలకు చూపిస్తున్నారు అని
ప్రధానమంత్రి గా అవకాశం వచ్చినా ఆ పదవి త్యాగం చేసిన రాహుల్ ఎక్కడ… మీరెక్కడ
తెలంగాణ విద్యార్థుల త్యాగం ముందు మీరెంత…?
8 ఏండ్ల కాలంలో ఒక్కసారైనా అమరవీరుల కుటుంబాలను పరామర్శించారా
మీలాగా ఎమ్మెల్యే కాగానే మంత్రి అయ్యారు… రాహుల్ గాంధీ అలా కాదు
వరంగల్ కు పదేపదే వచ్చే మీరు ఎన్నికల టూరిస్టులు
మీరు బీజేపీతో కలిసి ఆడిన డ్రామాలో రైతులు బలి అయ్యారు
నడ్డా సభ పెడితే మీరు ఎందుకు విమర్శించరు
రాహుల్ సభకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు
రాష్ట్రంలో మంత్రుల పరిస్థితి ఎంటో ప్రజలందరికి తెలుసు
రేవంత్ రెడ్డి ని గాడ్సే తో పోల్చే నికృష్టస్తితి లో మీరున్నారు
రాజకీయ లబ్దికోసం చేసే మీ జిమ్మిక్కులు మానుకోవాలి
ముఖ్యమంత్రి కాకుండానే ముఖ్యమంత్రి హోదా అనుభవిస్తున్నది మీరు
రాహుల్ గాంధీ ఏం తప్పు చేసారని క్షమాపణ చెప్పాలి
రాహుల్ డమ్మీ కాదు నిబద్ధత కల నాయకుడు
ఎయిర్పోర్ట్ రాలేదు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది
మాస్టర్ ప్లాన్ లేకుండా నగరాభివృద్ది ఎలా సాధ్యం
టీఆర్ఎస్ 8 ఏళ్ళ పాలనలో
దళిత ముఖ్యమంత్రి లేదు
దళితులకు మూడెకరాల భూమి
ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి
ఉచిత ఎరువులు,రైతుఋణమాఫీ,
రైతులకు పంట నష్ట పరిహారం
ధాన్యం కొనుగోలులో చిత్తశుద్ధి లేదు
డబుల్ బెడ్ రూమ్ అందరికీ కట్టిస్తాము అని మోసం
కొత్త రేషన్ కార్డుల ఊసే లేదు
కొత్త పెన్షన్ల ఇచ్చింది లేదు
ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదు
తెలంగాణ ఉద్యమకారుల ఉసే లేదుసీఎం సచివాలయానికి వచ్చేది లేదుతెలంగాణా విమోచన దినోత్సవం లేదు
అక్రమ కేసులకు న్యాయం లేదు
KG to PG అమలు లేదు
కుటుంబపాలనకు అడ్డే లేదు
తెలంగాణా విద్యావంతులకు విలువ లేదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేది లేదు
ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు అంతే లేదు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
ఈ కార్యక్రమంలో వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ,కూచనరవళి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి,పీసీసీ కార్యదర్శి శ్రీను,వర్ధన్న పేట నియోజకవర్గం ఇంచార్జి నమ్మిండ్ల శ్రీను, బంక సరళ జిల్లా మహిళా అధ్యక్షురాలు, జిల్లా sc సెల్ ప్రెసిడెంట్ Dr. రామకృష్ణ, ఓబీసీ జిల్లా ప్రెసిడెంట్ బొమ్మటి విక్రమ్, హన్మకొండ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ బంక సంపత్ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ సాయిరాం, రవి, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.