ఎర్రుపాలెం కుటుంబ కలహాల నేపథ్యంలో గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన, మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాలు, మండల కేంద్రమైన ఎర్రుపాలెం గ్రామానికి చెందిన మొగిలి వెంకటకృష్ణ 27 సంవత్సరాలు కె ఎం 544/25 వద్ద గూడ్స్ రైలు కింద పడిన సంగతి గమనించిన గూడ్సు రైలు డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఖమ్మం రైల్వే ఎస్ఐ బి. రవి కుమార్ కేసును రిజిస్ట్రేషన్ చేశారు, పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గోపాల్ రెడ్డి తెలిపారు, మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు