రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు - జంగా

జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల్లో ఒకటైన కాజీపేట్ రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి.

రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం తక్షణమే రద్దు చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కోచ్‌ ఫ్యాక్టరీ సాధన కోసం దేనికైనా సిద్ధమన్నారు.

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ 20 ఏళ్ల కల అని, కోచ్‌ ఫ్యాక్టరీ కోసం వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ కేటాయించాలని విభజన చట్టంలోనే ఉందన్నారు.

కోచ్‌ ఫ్యాక్టరీతో పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, కేంద్రం మోసం చేసిందన్నారు జంగా.

గిరిజన యూనివర్సిటీ కోసం 600 ఎకరాలు సేకరించినా, ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని ఇది గిరిజనులకు తీవ్ర ద్రోహం చేయడమే అన్నారు.

తెలంగాణలోని బీజేపీ & టిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే కేంద్రంతో పోరాడి కోచ్‌ ఫ్యాక్టరీ తీసుకురావాలని సవాల్‌ చేసారు.

రైలు డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ మాకొద్దని, కోచ్‌ ఫ్యాక్టరీ కావాలని డిమాండ్‌ చేశారు.

కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే 150 ఎకరాలు సేకరించామని, అయితే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు జంగా.

గతంలో దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.బిజేపీ తెలంగాణ ప్రజలకు సమాధానంచెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు.

ఏం ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లుఅడుగుతారని ఆయన ప్రశ్నించారు.ఇంకా ఎన్నిఅబద్ధాలు ఆడతారు? తెలంగాణ ప్రజల్ని ఎంత కాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ అంటే భారతీయ బొంకుడుపార్టీ అని తేలిపోయిందని జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి  చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదులమీద తెలంగాణ రాష్ట్ర నిర్మాణం చేస్తే బీజేపీ, టిఆర్ఎస్ అబద్దాల పునాదులపై అధికారం కోసం అర్రులుచాస్తోందని విమర్శించారు.

ఇప్పటి దాకా బీజేపీ బండి, గుండు, తొండి మాటలతో ప్రజల చెవుల్లోపువ్వులుపెట్టారని అన్నారు.

ఇప్పుడు ఏకంగా రాష్ట్ర బీజేపీ చెవుల్లో కేంద్రం పువ్వులు పెట్టిందనారు.

తెలంగాణకు అన్యాయంచేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టు మాదిరిగానే కాజీపేట రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి బిజెపి మంగళం పాడిందన్నారు.

కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు మార్లు
పార్లమెంటులో టీపీసీసీ అధ్యక్షులు & ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రాన్ని ప్రశ్నించిన కానీ ఏటువంటి సమాధానం తప్పించుకుంటుంది.

తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మాజీ డీసీసీ బ్యాంక్ చైర్మన్ & జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమంలో గాదె ఇన్నయ్య , అఖిలపక్ష నాయకులు సిపిఎం, ఎంసిపిఐ, ఎమ్మార్పీఎస్ కుల సంఘ నాయకులు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు, పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి , మాజీ మున్సిపల్ ఎర్రమల్ల సుధాకర్ , రాష్ట ఓబీసీ సెల్ కన్వీనర్ చింతకింది మల్లేష్, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ సంపత్ నాయక్ , జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు జమాల్ షరీఫ్ , జిల్లా యూత్ అధ్యక్షులు శివరాజ్ యాదవ్ , కళ్యాణం ప్రవీణ్ కుమార్ , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మారబోయిన పాండు , కౌన్సిలర్లు మంత్రి సుమలత శ్రీశైలం , ముస్యాల చందర్ , గంగారబోయిన మల్లేష్ , జనగామ పట్టణ ఉపాధ్యక్షులు ఎండీ గౌస్ పాషా , మోర్తల ప్రభాకర్ , సలెంద్ర మల్లేషం, బిసి సెల్ అధ్యక్షులు మంత్రి శ్రీశైలం గారు, ప్రధాన కార్యదర్శి టి. అండాలు , మచ్చ ప్రవీణ్, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు మేకల స్వామి , పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అజారుద్దీన్ , ఉడుగుల నర్సింగ్ రావు, ఎండీ ఇస్మాయిల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.