రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు

నిన్న తెలంగాణ శాసనసభలో బడ్జెట్ సమావేశం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత గౌరవనీయులు భట్టి విక్రమార్క గారిని అవమానపరిచే విధంగా ప్రవర్తించిన శాసనసభ స్పీకర్ వైఖరికి నిరసనగా ఈరోజు మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని డా,, బాబా సాహెబ్ విగ్రహం దగ్గర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పులి రాకేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే రోడ్డుపై బైఠాయించి స్పీకర్ సీఎం డౌన్ డౌన్ నినాదాలతో రాస్తారోకో చేయడం జరిగింది..
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా ప్రజా సంక్షేమ పథకాల పేరుతో తమ సొంత పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందించుకుంటూ పేద ప్రజల కడుపు కొడుతూ రాక్షస పరిపాలన చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న కల్వకుంట్ల కచరా ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్లు కొనసాగదు 2023 లో వీరి పైశాచిక పరిపాలన అంతమొందించే రోజులు దగ్గర పడ్డాయి 2023 సంవత్సరంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలన కోరుకుంటున్నారు… అని రాకేశ్ రెడ్డి గారు అన్నారు .. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆకుతోట కుమాస్వామి, బ్లాక్ అధ్యక్షులు బండి సుదర్శన్ గౌడ్ ,అధికార ప్రతినిధి నిరటి మహేందర్ , టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్, యూత్ అద్యక్షులు అజయ్ రెడ్డి , సీనియర్ నాయకులు మల్సాని నర్సింహారావు, తక్కలపల్లి రాజు, మంగళపల్లి శ్రీనివాస్, ఎండీ రఫీ, బండారి కుమార్ యాదవ్, గొల్లపల్లి చంద్రయ్య, రాములు, బొచ్చు రాజు, రామన్న తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.