సమస్యను పరిష్కరించాలంటూ గ్రామ సర్పంచ్,పెద్దమనుషులకు విన్నపం
ఈ69న్యూస్ జఫర్ఘడ్ జులై 14
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలోని పదో వార్డులో గుండెబోయిన యాదగిరి ఇంటి ముందు సిసి రోడ్డుపై గత నెల ముందు నుండి వాటర్ నిలిచి దుర్వాసన వస్తుంది.ఈ సమస్యపై గత నెల రోజుల ముందు గ్రామసభలో చెప్పడం జరిగింది.గ్రామ పెద్దలు వచ్చి సైడ్ కాలువ చేయాలని పరిష్కారం చేశారు.కానీ ఈ సమస్య ఇప్పటివరకు అలాగే ఉంది.వర్షాకాలం కాబట్టి వాటర్ నిలిచి దుర్వాసన వస్తుంది.ఇప్పుడు ఈ కాలంలో వచ్చేటువంటి డెంగ్యూ వ్యాధి గాని వివిధ రకరకాల కొత్త రోగాలు వస్తున్నాయి.మరియు ప్రజల రాకపోగలకి చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి దయచేసి సమస్యను పట్టించుకొని పరిష్కారం చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడాలంటు పదో వార్డ్ ప్రజలు వార్డ్ నెంబర్,మరియు గ్రామ సర్పంచ్, మరియు గ్రామ పెద్దలను కోరుతున్నారు.