రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించండి-డిజిపి సందీప్ శాండిల్య

రోడ్డు ప్రమాదాలను నియంత్రణ కోసం అధికారులు ముందుగా ప్రజల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని రైల్వే మరియు రోడ్డు సేఫ్టీ అదనపు డిజిపి సందీప్ శాండిల్య అధికారులకు సూచించారు, రోడ్లు ప్రమాదాల నివారణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు సేఫ్టీ అదనపు డిజిపి సందీప్ శాండిల్య మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హల్ లో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అదనపు డిజీపి సందీప్ సండిల్య మాట్లాడుతూ… తెలంగాణలో రోజు రోజుకి ప్రధాన రోడ్డు మార్గాల విస్తరణ పెరగడంతో పాటు అదే విధంగా వాహనాల సంఖ్య ఘణనీయంగా పెరగడంతో అదే స్థాయి రోడ్డు ప్రమాదాల జరుగుతున్నాయి. ప్రధాన రోడ్డు మార్గాల్లో ప్రమాదాల నివారించడంతో ప్రతి పోలీస్ అధికారి చిత్తశు ద్ధితో పనిచేయాల్సి వుంటుందని, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేయాల్సి వుంటుందని, అదే విధంగా ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే పట్ల దురుసు ప్రవర్తించకుండా వారికి మర్యాదపూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించ వద్దని సూచించాలని అలాగే రోడ్డు ప్రమాదాలపై ఫ్లెక్సీలు, పోస్టర్ల రూపంలో గ్రామాల్లో, పట్టణాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అదనపు డిజిపి అధికారులకు సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్, ఖమ్మం ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్,అధికారులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.