#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

హైదరాబాద్ విజిలెన్స్ విభాగం డి.ఎస్.పి…

అమరగాని కృష్ణయ్య…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టినందున కానిస్టేబుల్ నుండి గ్రూప్-1, గ్రూప్ 2 , ఇతర పోటీ పరీక్షలు ప్రిపేరవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు కావలసిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ను అమర గాని ఫౌండేషన్, కౌండిన్య గ్లోబల్ కమ్యూనిటీ అమెరికా వారి తరపున హైదరాబాద్ వినిలేన్స్ విభాగం డి ఎస్ పి అమర గాని కృష్ణయ్య నడిగూడెం గ్రంథాలయ అధికారి సర్వయ్య కు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఇష్టంతో చదివినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు తెలిపారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను గ్రంథాలయాలకు అందజేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని యువతీ, యువకులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు కావలసిన స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గుండు శ్రీనివాస్, నడిగూడెం పిఎసిఎస్ చైర్మన్ పుట్ట రమేష్ , హైదరాబాద్ లో సి ఐ గా విధులు నిర్వహిస్తున్న గుండు శ్రీకాంత్, గ్రామస్తులు బాణాల నాగరాజు ,వెనే పల్లి రంగారావు, అనంతుల మహేష్ గౌడ్, గంగరాజు , గుండు మహేందర్, రియజ్, పరశురాం, యువతీ, యువకులు తదితరులు పాల్గొన్నారు….

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.