లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ చేయడం హర్షణీయం

రెండవ రోజు ఉచిత అల్పాహారం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ

సూర్యాపేట జిల్లా కేంద్ర ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ సూర్యాపేట, ఆల్ క్లబ్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం కార్యక్రమంలో రెండవ రోజున ముఖ్య అతిధిగా సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సంస్ధలు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు, రోగుల బంధువులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేయడం పట్ల అభినందనలు తెలిపారు. సమాజానికి తమ వంతు సేవను అందించడానికి లయన్స్ క్లబ్ సంస్ధలు చేస్తున్న సేవా కార్యక్రమాలకు పట్టణ ప్రజలు, ప్రముఖుల సహకారం ఎల్లప్పుడూ వుంటుందని ఆమె అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చే పేషెంట్ ల సంఖ్య గతంలో కంటె ఎక్కువగా వుందని, జిల్లా వ్యాప్తంగా దూర ప్రాంతాలకు చెందిన వారు కూడ చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి వస్తున్నారని అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని ఆమె అన్నారు. కరోనా సమయంలో జిల్లా ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించడం లతో పొరుగు రాష్ట్రాల నుండి కూడ కరోనా పేషెంట్ లు కూడ చికిత్స కొరకు వచ్చారని ఆమె అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో జిల్లాకు మెడికల్ కాలేజ్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సూర్యాపేటకు వచ్చి మెడికల్ కాలేజ్ లో చదువుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ చంద్ర, చిలుముల శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్, జెడ్ సి వంగవేటి రమేష్, హోమియో వైద్యులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.